Telangana31st Dec 11:52 AMSunil Byrisetty1 min read

దసరా, బతుకమ్మలకు టోల్ మినహాయింపేదీ?

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి సందర్భంగా టోల్ ఫీజు మినహాయించాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లే

దసరా, బతుకమ్మలకు టోల్ మినహాయింపేదీ?
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి సందర్భంగా టోల్ ఫీజు మినహాయించాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాయడంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. “తెలంగాణ ప్రజలపై ఇదే దయ ఎందుకు చూపరు?” అంటూ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగాలు, చదువుల కోసం ఉంటున్న తెలంగాణ బిడ్డలు పండుగల సమయంలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ వంటి స్వగ్రామాలకు వెళ్లాలంటే వందల రూపాయల టోల్ ఫీజులు చెల్లించాల్సి వస్తోందని గుర్తుచేస్తున్నారు. సంక్రాంతికే కాకుండా దసరా, బతుకమ్మ వంటి తెలంగాణ ప్రధాన పండుగల సందర్భంగా కూడా టోల్ ఫీజు మినహాయింపు ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. “ఒక మార్గానికే ప్రత్యేక సడలింపు ఎందుకు? తెలంగాణ అంతటా జాతీయ రహదారులపై పండుగల సమయంలో టోల్ మినహాయింపు ఇవ్వాలి” అని సోషల్ మీడియా వేదికగా కోరుతోంది.
BRS
Telangana Politics
Toll Fee Waiver
Dasara
Bathukamma
Sankranti
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సోషల్ మీడియా విమర్శలు
తెలంగాణ పండుగలు
Scroll for the next article