Technology25th Dec 04:56 PMSunil Byrisetty1 min read

BSNL పండుగ ఆఫర్‌.. రూపాయికే నెల రీఛార్జ్..!

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ క్రిస్మస్‌ సందర్భంగా ఇటీవల క్రిస్మస్ బోనంజా ఆఫర్‌ ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కేవలం రూ.1 రీఛార్జ్‌ కే నెల రోజుల వ్యాలి

BSNL పండుగ ఆఫర్‌.. రూపాయికే నెల రీఛార్జ్..!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ క్రిస్మస్‌ సందర్భంగా ఇటీవల క్రిస్మస్ బోనంజా ఆఫర్‌ ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కేవలం రూ.1 రీఛార్జ్‌ కే నెల రోజుల వ్యాలిడిటీ లో ప్లాన్‌ ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS, రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. ఈ ఆఫర్‌ కేవలం కొత్త సిమ్ కార్డులపై మాత్రమే అందిస్తున్నట్లు BSNL తెలిపింది. ఈ ఆఫర్‌ ఇటీవలే ప్రారంభం కాగా.. ఈనెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది. BSNL కార్యాలయాలు సహా ఇతర ఆధీకృత కేంద్రాలను సందర్శించి, ఈ ఆఫర్‌ ను పొందవచ్చు. క్రిస్మస్‌, కొత్త సంవత్సరం సందర్భంగా BSNL మరో ఆఫర్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జనవరి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన రీఛార్జ్‌ ప్లాన్లపై అదనపు డేటాను అందిస్తోంది. రూ.225, రూ.347, రూ.485, రూ.2399 రీఛార్జ్‌ ప్లాన్‌ లపై రోజువారీ అదనపు డేటాను పొందవచ్చు.
BSNL Offer
BSNL Christmas Bonanza
BSNL Recharge Plan
₹1 Recharge Offer
BSNL New SIM Offer
Unlimited Calling
2GB Daily Data
BSNL Festive Offer
BSNL Data Offer
BSNL India
Telecom News
New Year Offers
Scroll for the next article