Politics13th Aug 01:44 PMSunil Byrisetty1 min read

రీపోలింగ్ కోరి.. బహిష్కరిస్తారా?: వైసీపీలో బీటెక్ రవి

వైసీపీపై పులివెందుల నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శలు సంధించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ జడ్పీటీసీ ఉపఎన్నికలో రీపోలింగ్ కోరిన వైఎస్సార్సీపీ, ఇప్పుడు ఎన్నికల సంఘం ఆదే

రీపోలింగ్ కోరి.. బహిష్కరిస్తారా?: వైసీపీలో బీటెక్ రవి
వైసీపీపై పులివెందుల నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శలు సంధించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ జడ్పీటీసీ ఉపఎన్నికలో రీపోలింగ్ కోరిన వైఎస్సార్సీపీ, ఇప్పుడు ఎన్నికల సంఘం ఆదేశించిన రెండు బూత్‌ల రీపోలింగ్‌ను బహిష్కరించడం ఏమిటని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా పారిపోతోందని తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ తీరుపై పలు ప్రశ్నలు సంధించారు. "మొదట 15 బూత్‌లలో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేసింది వైఎస్సార్సీపీ. ఇప్పుడు ఎన్నికల సంఘం రెండు బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశిస్తే, దానిని బహిష్కరిస్తున్నామని వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ప్రజాస్వామ్యంపైనా, ప్రజలపైనా నమ్మకం ఉంటే ఈ రెండు బూత్‌లలో రీపోలింగ్ ను ఎందుకు అంగీకరించడం లేదు? ప్రజలు మీకు ఓటు వేయరని, మీరు ఓడిపోతారని స్పష్టంగా తెలియడం వల్లే ఈ బాయ్‌కాట్ డ్రామా ఆడుతున్నారు" అని బీటెక్ రవి ఆరోపించారు.
Andhra Pradesh politics
Pulivendula politics
B.Tech Ravi
YSR Congress Party
re-polling controversy
కడప జిల్లా
జడ్పీటీసీ ఉపఎన్నిక
రాజకీయ విమర్శలు
Scroll for the next article