News8th Jan 03:10 PMSunil Byrisetty1 min read

లింక్డ్ ఇన్‌లో మంత్రికి రిక్వెస్ట్.. వెంటనే అపాయింట్మెంట్

తెనాలికి చెందిన బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న యువతి మంత్రిని కలిసేందుకు వినూత్నంగా ప్రయత్నించింది. తన దగ్గర ఉన్న ఐడియాను మంత్రి దృష్టిలో పెట్టాలనే ఆలోచనతో.. లింక్డ్ ఇన్ లో కలవాలి

లింక్డ్ ఇన్‌లో మంత్రికి రిక్వెస్ట్.. వెంటనే అపాయింట్మెంట్
తెనాలికి చెందిన బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న యువతి మంత్రిని కలిసేందుకు వినూత్నంగా ప్రయత్నించింది. తన దగ్గర ఉన్న ఐడియాను మంత్రి దృష్టిలో పెట్టాలనే ఆలోచనతో.. లింక్డ్ ఇన్ లో కలవాలి అనుకుంటున్నానంటూ రిక్వెస్ట్ పెట్టింది. తొలుత ఆశ్చర్యపోయిన ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఒక్కరే వచ్చిన ఆ యువ..తి ఒక బుక్ లెట్ లో తాను చెప్పాలనుకుంటున్న డిజైన్‌ను చూపించి, జపాన్, జర్మనీ టెక్నాలజీతో తాను పని చేస్తున్నానని.. ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయాలనుకుంటున్నానని.. మంత్రికి వివరించింది. తాను ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేశానని, కాలేజి నుంచి సహకారం ఉందని తెలిపింది. మంత్రి సానుకూలంగా రియాక్ట్ అయి.. ఏం చేయాలో చెప్పారు. సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. దీనిపై అటు యువతి, ఇటు మంత్రికి ప్రశంసలు అందుతున్నాయి.
Andhra Pradesh
LinkedIn
Andhra Pradesh
AP Minister
Kondapalli Srinivas
BTech Student
Young Innovator
Startup
Student Entrepreneur
Women Empowerment
Innovation
జర్మనీ టెక్నాలజీ
ప్రభుత్వ సహకారం
ప్రేరణాత్మక కథ
విద్యార్థి
Scroll for the next article