News3rd Nov 05:00 PMSunil Byrisetty1 min read

బుడమేరు విషయంలో ఆందోళన చెందవద్దు!

బుడమేరు విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ప్రస్తుతం బుడమేరు పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందన్నారు. అధికారులు క్షేత్రస్థా

బుడమేరు విషయంలో ఆందోళన చెందవద్దు!
బుడమేరు విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ప్రస్తుతం బుడమేరు పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కొండ ప్రాంతాలు మినహా ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పుకార్లను నమ్మి భయాందోళనలకు గురికావద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు.
Scroll for the next article