Politics9th Jul 12:51 PMSunil Byrisetty1 min read

కొడాలి నానికి లాస్ట్ వార్నింగ్ ఇచ్చిన బుద్దా వెంకన్న

టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయ భిక్షతోనే కొడాలి నాని ఎమ్మెల్యేగా ఎదిగారని వ్యాఖ్యానించారు. ఎన్న

కొడాలి నానికి లాస్ట్ వార్నింగ్ ఇచ్చిన బుద్దా వెంకన్న
టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయ భిక్షతోనే కొడాలి నాని ఎమ్మెల్యేగా ఎదిగారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న నాని, ఇప్పుడు మళ్లీ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల మధ్య బలమైన అనుబంధాన్ని ఎలాంటి కుట్రలతోనూ దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని కొడాలి నానికి సవాల్ విసిరారు. చట్టాలను, హిందూ దేవుళ్లను అవమానించే వ్యాఖ్యలపై సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకత్వం ఇలాంటి వారిని ప్రోత్సహిస్తోందని ఆరోపించిన బుద్దా వెంకన్న, కొడాలి నాని తన వ్యాఖ్యలను నియంత్రించుకోవాలంటూ లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి పిచ్చిగా వాగితే.. బుద్ది చెప్పి తీరుతామని హెచ్చరించారు.
Andhra Pradesh
politics
Budda Venkanna
Kodali Nani
TDP
YSRCP
Chandrababu Naidu
Pawan Kalyan
రాజకీయ విమర్శలు
వైఎస్సార్సీపీ నాయకులు
రాజకీయ వ్యాఖ్యలు
Scroll for the next article