Politics5th Nov 04:18 PMSunil Byrisetty1 min read
పరామర్శ పేరుతో రైతులపై దండయాత్ర
కృష్ణా జిల్లాలో రైతుల పరామర్శకు అంటూ వెళ్లి పూలవర్షం కురిపించుకున్న ఏకైక నాయకుడు ఎమ్మెల్యే వై.ఎస్.జగన్.. అని మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంక
కృష్ణా జిల్లాలో రైతుల పరామర్శకు అంటూ వెళ్లి పూలవర్షం కురిపించుకున్న ఏకైక నాయకుడు ఎమ్మెల్యే వై.ఎస్.జగన్.. అని మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. రైతులు ఓట్లు వేయలేదన్న అక్కసుతో పరామర్శ పేరుతో జగన్ రైతులపై కి దండయాత్రలాగా వెళ్లారని మండిపడ్డారు. జగన్ రైతుల పరామర్శ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుపై చేసిన విమర్శలను ఖండించారు. సీఎం చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చేంత సీన్ జగన్ మోహన్ రెడ్డికి లేదన్నారు. జగన్ తన పాలనలో మూడేళ్ల పాటు ఫసల్ భీమా యోజనకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్మును చెల్లించలేదని తెలిపారు. ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పటం జగన్ అబద్ధాలకు పరాకాష్ట అన్నారు.