Politics7th Dec 05:38 PMSunil Byrisetty1 min read
దొంగను వెనకేసుకొస్తున్న జగన్!
మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న మాట్లాడుతూ వైఎస్ జగన్ పరకామణి చోరీ కేసుపై చేసిన వాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. లక్షల కోట్లు దోచుకున్న జగన్ కి పరకా
మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న మాట్లాడుతూ వైఎస్ జగన్ పరకామణి చోరీ కేసుపై చేసిన వాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. లక్షల కోట్లు దోచుకున్న జగన్ కి పరకామణి కేసు చాలా చిన్నదేనని ఎద్దేవా చేశారు.
పరకామణి కేసులో ముద్దాయి రవికుమార్ సాక్షాత్తు తప్పును ఒప్పుకున్నాడని గుర్తు చేశారు.
అయినా దొంగను జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిగా జగన్ భక్తితో దేవుడి దగ్గరికి వెళ్లలేదు.. ప్రజల కోసం మాత్రమే వెళ్ళాడన్నారు.
సిట్ విచారణలో అన్ని బయటకు వస్తాయని స్పష్టం చేశారు. జగన్ పరకామణి కేసు చిన్నదనీ వ్యాఖ్యానించడం.. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.