Politics25th May 11:30 AMSunil Byrisetty1 min read

పేర్ని నానీకి బుద్దా మాస్ వార్నింగ్!

పేర్ని నానీకి అస్సలు సిగ్గు ఉందా అంటూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. వల్లభనేని వంశీ స్వాతంత్ర్య సమరయోధుడు అన్నట్లుగా పేర్ని నానీ తెగ బిల్డప్ ఇస్తున్నాడని వ్

పేర్ని నానీకి బుద్దా మాస్ వార్నింగ్!
పేర్ని నానీకి అస్సలు సిగ్గు ఉందా అంటూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. వల్లభనేని వంశీ స్వాతంత్ర్య సమరయోధుడు అన్నట్లుగా పేర్ని నానీ తెగ బిల్డప్ ఇస్తున్నాడని వ్యాఖ్యానించారు. పేర్ని నానీకి సిగ్గు ఉంటే తన బియ్యం కుంభకోణం గురించి చెప్పాలన్నారు. వంగవీటి మోహన రంగా పేద ప్రజల కోసం పాటు పడిన మహనీయుడని, అటువంటి గొప్ప వ్యక్తితో వంశీకి పోలికా అని.. నానీ నీ బుర్ర పని చేస్తుందా అని నిలదీశారు. పేదవాళ్లను అడ్డం పెట్టుకుని డబ్బులు కొట్టేసిన వ్యక్తి వంశీ అన్నారు. నానీ మోకాళ్ల మీద కూర్చుని రంగా అభిమానులు, వంగవీటి రాధాకృష్ణకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh
AP Politics
YSRCP
TDP
Buddha Venkanna
Perni Nani
మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు
వల్లభనేని వంశీ
Scroll for the next article