News18th Apr 03:21 PMSunil Byrisetty1 min read
యోగా పేరుతో దగా.. 40 కోట్లు స్వాహా!
ప్రభుత్వ పాఠశాలల్లో యోగా టీచర్లుగా ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. 40 కోట్లు స్వాహా చేసిన ఘటన గుంటూరులో వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,700 మంది నిరుద్యోగులను బుద్ధ యోగా ఫౌండే
ప్రభుత్వ పాఠశాలల్లో యోగా టీచర్లుగా ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. 40 కోట్లు స్వాహా చేసిన ఘటన గుంటూరులో వెలుగులోకి వచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా 1,700 మంది నిరుద్యోగులను బుద్ధ యోగా ఫౌండేషన్ నిర్వాహకుడు మోసం చేశాడని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలి ఆరోపించారు.
దీనిపై గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్‌ను కలిసి ఫౌండేషన్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
స్పందించిన ఎస్పీ ప్రత్యేక విచారణకు ఆదేశించారు.
2022లో గుంటూరు బ్రాడీపేటలో సయ్యద్‌వలి బుద్ధ యోగా ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో యోగా టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, నెలకు రూ.34 వేల జీతం వస్తుందని నిరుద్యోగులను నమ్మించి ఒక్కో ఉద్యోగానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు తీసుకున్నాడని పేర్కొన్నారు.
నకిలీ నియామకపత్రాలు సృష్టించి కొంత మందికి ఆయనే నెలకు రూ. 17 నుంచి 25 వేలు చొప్పున జీతాలు ఇచ్చి నమ్మించాడు.
రూ.కోట్లు వసూలు చేసుకొని ఆ తర్వాత నుంచి ఎవరికీ జీతాలు ఇవ్వలేదని పేర్కొన్నారు.