News13th Nov 04:02 PMSunil Byrisetty1 min read
పంచాయతీ ఎన్నికల్లోనైనా అక్రమాలకు తావివ్వొద్దు
ఎన్నికల వ్యవస్థను దెబ్బతీస్తే రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలైనా ప్రజాస్వామ్యబద్ధంగా, నిష్పక్షపాతంగా నిర్వహిం
ఎన్నికల వ్యవస్థను దెబ్బతీస్తే రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలైనా ప్రజాస్వామ్యబద్ధంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యానికి తావులేకుండా ప్రతి అభ్యర్థికి సమాన అవకాశం కల్పించాలని, ప్రజలు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు కల్పించాలని కోరారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నంద్యాల జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఒకప్పుడు బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో హింస, అక్రమాలు జరుగుతాయని వినేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లోని పరిషత్, మున్సిపాలిటీల్లో కనిపించడం ప్రజాస్వామ్యానికి, రాష్ట్ర భవిష్యత్తుకు, బ్రాండ్ ఆంధ్రాకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు.