News26th Mar 04:16 PMSunil Byrisetty1 min read

భద్రాద్రి జిల్లాలో కూలిన భవనం.. ఏడుగురి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భారీ భవనం నేల కూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న భారీ భవన

భద్రాద్రి జిల్లాలో కూలిన భవనం.. ఏడుగురి మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భారీ భవనం నేల కూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. భద్రాచలం పుణ్యక్షేత్రంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆరు అంతస్తుల భవనం పూర్తిగా కూలి ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం నాణ్యత లోపంతో కూలినట్టుగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో అందులో పనిచేస్తున్న కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమీప ఇళ్లలోని ప్రజలు ప్రాణ భయంతో బయటికి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. వెంటనే ప్రమాద సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. భవనం కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Bhadradri Kothagudem
Seven dead
Building Collapses
Scroll for the next article