News12th Jun 11:20 AMSunil Byrisetty1 min read

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో క్రీడాకారులకు ఇచ్చిన మాట ప్రకారం రాజమహేంద్రవరంలో రూ.3.60

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో క్రీడాకారులకు ఇచ్చిన మాట ప్రకారం రాజమహేంద్రవరంలో రూ.3.60 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని నిర్మించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందనేందుకు ఈ స్టేడియం నిర్మాణమే నిదర్శనమన్నారు. ఇండోర్ స్టేడియానికి గోదావరి పుష్కరాలు పేరును పెట్టడం సరికొత్త అధ్యాయమని, గోదావరి పుష్కరాల ప్రాశస్త్యాన్ని క్రీడారంగంలో ఇనుముడింప జేయడం శుభ పరిణామమన్నారు. నూతన క్రీడా విధానం ద్వారా ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాల ఏర్పాటుతో రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్టేడియాన్ని ప్రారంభించిన శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు మంత్రి లోకేష్ అభినందనలు  తెలిపారు.
Andhra Pradesh news
nara lokesh
Rajamundry
Godavari Pushkaram Indoor Stadium
sports complex
MLA Adireddi Srinivas
రాజమహేంద్రవరంలో రూ.3.60 కోట్లతో ఇండోర్ స్టేడియం
Scroll for the next article