Sports29th Aug 10:08 AMSunil Byrisetty1 min read

క్రీడాకారులకు బంపరాఫర్!

జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఏపీ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ అందిస్తోంది. తాజాగా ఈరోజు రూ.1.98 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్ర‌భుత్వం విడుదల చేసినట్లు

క్రీడాకారులకు బంపరాఫర్!
జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఏపీ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ అందిస్తోంది. తాజాగా ఈరోజు రూ.1.98 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్ర‌భుత్వం విడుదల చేసినట్లు శాప్ ఛైర్మన్ రవినాయుడు తెలిపారు. ఏపీలో 177 మంది జాతీయ క్రీడాకారులకు ప్రోత్సాహకాలు విడుదల చేయడం హర్షణీయమన్నారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు వారిని గౌరవించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. క్రీడా ప్రోత్సాహకాలు విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబుకి క్రీడాకారుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Andhra Pradesh Government
AP Sports
National Sports Day
Athlete Incentives
Chandrababu Naidu
Sports Promotion
Athlete Welfare
Sports
క్రీడల ప్రోత్సాహం
క్రీడాకారుల సంక్షేమం
Scroll for the next article