News28th Mar 02:31 PMSunil Byrisetty1 min read
లేపాక్షి ఉద్యోగులకు బంపర్ ఆఫర్!
ప్రభుత్వ రంగ సంస్థ అయిన లేపాక్షి హాండీక్రాఫ్ట్స్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగానే కాక దేశ విదేశాల్లో హస్తకళలకు కేరాఫ్‌గా లేపాక్షికి పేరుంది. అరుదైన హస్
ప్రభుత్వ రంగ సంస్థ అయిన లేపాక్షి హాండీక్రాఫ్ట్స్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగానే కాక దేశ విదేశాల్లో హస్తకళలకు కేరాఫ్‌గా లేపాక్షికి పేరుంది.
అరుదైన హస్తకళలను ప్రోత్సహించే లేపాక్షి బ్రాంచులు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉన్నాయి.
ఈ ఉత్పత్తులకు దేశవిదేశాల్లో సైతం డిమాండ్ ఉంది.
కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక ఉత్పత్తులు, కలంకారీ ఇలా చేతితో తయారు చేసే అనేక ఉత్పత్తులను లేపాక్షి ప్రమోట్ చేస్తుంది.
ఇప్పుడు ఈ లేపాక్షి ఉద్యోగులకు ఎన్డీఏ ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించింది.
2024-25లో లేపాక్షికి రూ.5.50 కోట్లు లాభాలు రావడంతో ఉద్యోగులకు రూ.32.42 లక్షలు ఇన్సెంటివ్‌లు మంజూరు చేసింది.
గత జగన్ ప్రభుత్వంలో కరోనా పేరుతో ఇన్సెంటివ్‌లు ఇవ్వకపోవడం గమనార్హం.
దీంతో లేపాక్షి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.