News30th Apr 03:57 PMSunil Byrisetty1 min read

నైపుణ్యాభివృద్ధి కోసం యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు సాధికారత కల్పించేందుకు యునిసెఫ్‌తో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఏపీ ప్రభుత్వం, యూని

నైపుణ్యాభివృద్ధి కోసం యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు సాధికారత కల్పించేందుకు యునిసెఫ్‌తో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఏపీ ప్రభుత్వం, యూనిసెఫ్ 3 ప్రధాన యువశక్తి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్ఎస్ డీసీ, యునిసెఫ్ యువాహ్ ప్రతినిధులు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా యునిసెఫ్, ఏపీఎస్ఎస్ డీసీ పరస్పర సహకారంతో యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ (YFSI), యూత్ హబ్, పాస్‌పోర్ట్ టు ఎర్నింగ్ (P2E) కార్యక్రమాలను అమలుచేయనున్నారు. ఇంటికో వ్యాపారవేత్త, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు ఇవి ఎంతగానో తోడ్పాటును అందించనున్నాయి. యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ (YFSI) ద్వారా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ అభ్యసించే 2 లక్షల మంది యువతకు వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ఉద్యోగ సృష్టి, సమస్యల పరిష్కార నైపుణ్యాలను అందించేందుకు యూనిసెఫ్ గ్లోబల్ UPSHIFT ఫ్రేమ్‌వర్క్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. పాస్‌పోర్ట్ టు ఎర్నింగ్ (P2E) కార్యక్రమం ద్వారా 15 నుంచి 29 సంవత్సరాల మధ్యగల యువతకు ఉచితంగా అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్, ప్రొఫెషనల్ నైపుణ్య శిక్షణను అందిస్తారు.
Nara Lokesh
unisef
Youth Hub
business skills for 2 lakh youth
ఏపీ ప్రభుత్వం
యూనిసెఫ్ 3 ప్రధాన యువశక్తి అభివృద్ధి
యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్
యూనిసెఫ్ గ్లోబల్ UPSHIFT ఫ్రేమ్‌వర్క్ ద్వారా శిక్షణ
Scroll for the next article