News12th Nov 10:19 AMSunil Byrisetty1 min read
అనుమతి పొందిన లేఔట్‌లలో మాత్రమే ప్లాట్స్ కొనాలి
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ(APCRDA) పరిధిలో గల కొన్ని గ్రామాలలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటైన అక్రమ లేఔట్‌లను, అనధికార భవనాలను APCRDA అధిక
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ(APCRDA) పరిధిలో గల కొన్ని గ్రామాలలో ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా ఏర్పాటైన అక్రమ లేఔట్‌లను, అనధికార భవనాలను APCRDA అధికారులు ప్రొక్లైనర్‌తో తొలగించారు. అలాంటి అనధికార లేఔట్‌లలోని ప్లాట్స్ కొంటే భవన నిర్మాణములకు అనుమతులు మంజూరు చేయబోమని సీఆర్డీఏ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మౌలిక సదుపాయాలకూ ఇబ్బందులు కలుగుతాయన్నారు. కనుక సీఆర్డీఏ పరిధిలోని ప్రజలు ప్రభుత్వ అనుమతి పొందిన లేఔట్‌లలో మాత్రమే ప్లాట్స్ కొనుగోలు చేయాలని సూచించారు. ప్లాను లేని భవనాలు కట్టుకుంటే విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజి కనెక్షన్‌లకు అనుమతులు మంజూరు చేయబడవని తెలిపారు. ఏవైనా అనధికార లేఔట్‌లు లేదా అనధికార కట్టడాలను గుర్తిస్తే వాట్సప్ నెంబర్ :7095599838(మెసేజ్ కొరకు) లేదా నెంబర్ :0866-2527154కు కాల్ చేయాలని కోరారు. అలాగే వెబ్సైట్ : https://crda.ap.gov.in/apcrdav2/Views/Grievance Redressal System.aspx సందర్శించవచ్చని సూచించారు.