Entertainment31st Jul 12:03 PMSunil Byrisetty1 min read
చిరంజీవికి కీలక పదవి?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవిని నియమించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలు అప్పగించే అవ
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవిని నియమించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనిపై ప్రస్తుతం అధికారిక ప్రకటన లేకపోయినా రాజకీయ, సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. సేవా కార్యక్రమాలు, జాతీయ స్థాయి గుర్తింపు, అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు వంటి అంశాలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు కేంద్రంలోనూ చిరంజీవికి మంచి పరిచయాలే ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేసిన చిరుకు అన్ని పార్టీల్లో సన్నిహితులు ఉన్నారు.