Politics15th Mar 04:03 PMSunil Byrisetty1 min read

పవన్ కల్యాణ్ జాగ్రత్తగా అబద్దాలు ఆడాలి

పవన్‌ కల్యాణ్ తమ పార్టీ ఆవిర్భావ సభలో చేగువేరా కమ్యూనిస్టుల గురించి చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు అన్నారు. చేగువేరా డాక్టర్‌ కాబట్టి

పవన్ కల్యాణ్ జాగ్రత్తగా అబద్దాలు ఆడాలి
పవన్‌ కల్యాణ్ తమ పార్టీ ఆవిర్భావ సభలో చేగువేరా కమ్యూనిస్టుల గురించి చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి.రాఘవులు అన్నారు. చేగువేరా డాక్టర్‌ కాబట్టి అభిమానించానని, కమ్యూనిస్టు కాబట్టి తాను అభిమానించలేదని పవన్‌ అనడం చూస్తే చేగువేరా ఎక్కడ డాక్టర్‌గా వైద్యం చేశారో పవన్‌ చెప్పాలని రాఘవులు ప్రశ్నించారు.. చేగువేరా గొప్ప విప్లవకారుడని అందరికీ తెలుసన్నారు. సినిమాల్లో ఆయన బొమ్మలు పెట్టిన పవన్‌ యువత ను రెచ్చగొట్టేలా మాట్లాడిన సంగతి ఎవ్వరూ మరచిపోరన్నారు. అబద్దం కూడా జాగ్రత్తగా ఆడాలని పవన్‌కు హితవు పలికారు. మూడు భాషలను రాష్ట్రాలపై రుద్దాలని కేంద్రం చూడడాన్ని బెదిరింపులకు దిగడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బివి.రాఘవులు స్పష్టం చేశారు. త్రిభాష అమలు చేస్తేనే నిధులు ఇస్తామన్నా లింకు కూడా సరైంది కాదన్నారు.. కేంద్రం తెచ్చే డీలిమిటేషన్‌ విధానం పై రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రాల మధ్య సమతుల్యత దెబ్బతినకూడదన్నారు. జనాభాను నియంత్రణ చేసే రాష్ట్రాలను దెబ్బతీయాలనీ కేంద్రం చూస్తుందన్నారు. సీట్ల నిష్పత్తి మారకుండా డీలిమిటేషన్‌ చేయాలనీ సిపిఎం విధానం ఇదేనన్నారు.
AP Politics
BV Raghavulu
jana sena
Jana Sena Formation Day
Pawan kalyan
ఏపీ రాజకీయాలు
బివి రాఘవులు
జనసేన
జనసేన ఆవిర్భావ దినోత్సవం
పవన్ కళ్యాణ్
Scroll for the next article