Politics26th Aug 01:04 PMSunil Byrisetty1 min read
విగ్రహాల తొలగింపునకు న్యాయపోరాటం
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడానికి సహకరించిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, నిర్వాహకులు, గ్రామస్తులకు, ఈ విగ్రహ
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడానికి సహకరించిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, నిర్వాహకులు, గ్రామస్తులకు, ఈ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్పందించిన హిందూ సంఘాలు, బిసి సంఘాల ప్రతినిధులకు బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరిలోని బిసివై పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు, యాదవ సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకించాయన్నారు. తాను కూడా తక్కెళ్లపాడుకు వెళ్లి విగ్రహం ఏర్పాటు చేయవద్దని నిర్వాహకులకు చెప్పి వస్తే... విగ్రహం పెట్టబోమని ప్రకటించి మళ్లీ రాత్రికి రాత్రే విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. దీంతో తాను విశాఖపట్నం నుంచి ఛలో తక్కెళ్లపాడుకు పిలుపునిచ్చానన్నారు. దీంతో వివాదాన్ని గుర్తించిన మంత్రి నారా లోకేష్ జోక్యంతో నిర్వాహకులు బేషజాలకు పోకుండా శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించి, ఎన్టీఆర్ రూపంలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. వారందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.