Politics22nd Sep 12:07 PMSunil Byrisetty1 min read

దేశంలో మోగిన ఉప ఎన్నికల నగారా!

పలు రాష్ట్రాల్లో ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ని ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. యూపీ, ఉత్తరాఖండ్‌లో ఖాళీ అయిన 11 రాజ

దేశంలో మోగిన ఉప ఎన్నికల నగారా!
పలు రాష్ట్రాల్లో ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ని ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. యూపీ, ఉత్తరాఖండ్‌లో ఖాళీ అయిన 11 రాజ్యసభ స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 29న ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు అక్టోబర్‌ 6 గడువు తేదీగా ప్రకటించారు. అక్టోబర్ 7న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు గడువు అక్టోబర్‌ 9గా తెలిపారు. అక్టోబర్‌ 23న ఎన్నికలు, తర్వాత 27న కౌంటింగ్‌ జరగనుంది.
Scroll for the next article