Politics29th Jul 04:35 PMSunil Byrisetty1 min read

వైసీపీ ఎంపీలే జాతి రత్నాలన్న మహిళా ఎంపీ

నిజమైన కామెడీ జాతి రత్నాలు వైసీపీ ఎంపీలు అని, వాళ్లని చూసే సినిమా తీశారేమో అనిపిస్తుందని, వైసిపి ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని వాళ్ళు, టీచర్లను మద్యం షాపుల దగ

వైసీపీ ఎంపీలే జాతి రత్నాలన్న మహిళా ఎంపీ
నిజమైన కామెడీ జాతి రత్నాలు వైసీపీ ఎంపీలు అని, వాళ్లని చూసే సినిమా తీశారేమో అనిపిస్తుందని, వైసిపి ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని వాళ్ళు, టీచర్లను మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టిన వైసీపీ వాళ్ళు ఈరోజు నారా లోకేష్ గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని, ఎప్పుడు శవాలు దొరుకుతాయా ఎప్పుడు శవయాత్రలు చేద్దామా అని చూసే మీకు మేము చేస్తున్న అభివృద్ధి ఏమి కనిపిస్తుందిలే అంటూ, పేపర్ లీకేజీ బిల్లుపై వైసీపీ ఎంపీలు పారిపోతున్నారని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరిఅన్నారు. బుధవారం భారత పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు వైఖరిని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీవ్రంగా తప్పుపట్టారు. పేపర్ల లీకేజీని అరికట్టే అత్యంత కీలకమైన బిల్లుపై సభలో మాట్లాడాలని కోరితే, వైసీపీ ఎంపీలు ఆ విషయాన్ని వదిలేసి తప్పించుకునే ధోరణితో ఇతర అంశాలపై మాట్లాడుతున్నారని విమర్శించారు.
Andhra Pradesh Politics
Byreddy Shabari
TDP
YSRCP
Nara Lokesh
Paper Leak Bill
Lok Sabha
Parliament
మెగా డీఎస్సీ
ఉపాధ్యాయ నియామకాలు
నంద్యాల ఎంపీ
రాజకీయ వార్తలు
Scroll for the next article