News29th Apr 05:19 PMSunil Byrisetty1 min read
అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్‌కు మెరుగులు
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ (ఆప్కోస్)పై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకు
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ కార్పొరేషన్ (ఆప్కోస్)పై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.
రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకునే ప్రస్తుత వ్యవస్థపై సమీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉపసంఘంలో మున్సిపల్ మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు.
ఈ ఉపసంఘం ప్రస్తుత వ్యవస్థ కంటే మరింత జవాబుదారీగా, సమర్థవంతంగా, పారదర్శకంగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలు, వారి సంక్షేమాన్ని ఎలా పెంపొందించాలన్న దానిపై నివేదిక ఇవ్వనుంది.