News13th Aug 01:10 PMSunil Byrisetty1 min read

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ప్రారంభమైంది. జిల్లాల సరిహద్దులు,పేర్లపై వచ్చిన అభ్యంతరాలపై ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్ లో జరిగిన మెదటి సమావేశంల

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ప్రారంభమైంది. జిల్లాల సరిహద్దులు,పేర్లపై వచ్చిన అభ్యంతరాలపై ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్ లో జరిగిన మెదటి సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత , పి.నారాయణ , నిమ్మల రామానాయుడు , నాదెండ్ల మనోహర్,బీసీ జనార్దన్ రెడ్డి,  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పునకు సంబంధించిన విజ్ఞప్తులను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించింది. పేర్లు, సరిహద్దుల మార్పునకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై చర్చించింది.
Andhra Pradesh
Cabinet Sub-Committee
District Boundaries
Name Changes
Revenue Divisions
Mandals
Villages
Public Requests
Ministers Meeting
జిల్లాల పునర్వ్యవస్థీకరణ
సరిహద్దుల మార్పు
పేర్ల మార్పు
Scroll for the next article