News10th Oct 11:52 AMSunil Byrisetty1 min read
రుషికొండ భవనాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
రుషికొండలో ఖాళీగా ఉన్న భవనాలను సరైన విధంగా వినియోగించే మార్గాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలోని 2వ బ్లాక్ లో భేటీ అయింది. భేటీకి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక
రుషికొండలో ఖాళీగా ఉన్న భవనాలను సరైన విధంగా వినియోగించే మార్గాలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలోని 2వ బ్లాక్ లో భేటీ అయింది. భేటీకి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ జైన్ హాజరయ్యారు. గత ప్రభుత్వం హరిత రిసార్ట్స్ స్థానంలో రుషికొండలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టడంతో ఆ భవనాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ అంశాలపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. త్వరలోనే ప్రభుత్వానికి సిఫారసులు అందించనుంది.