News21st Dec 04:23 PMSunil Byrisetty1 min read

జర్నలిస్టుల సంక్షేమానికి ఐక్యంగా కృషి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (APEMJA) ప్రథమ సమావేశం విజయవాడలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఆదివారం జరిగింది. APEMJA అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శి

జర్నలిస్టుల సంక్షేమానికి ఐక్యంగా కృషి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (APEMJA) ప్రథమ సమావేశం విజయవాడలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఆదివారం జరిగింది. APEMJA అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శివ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి. సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వారికి రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావడానికి అసోసియేషన్ కృషి చేయాలని కోరారు. ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే, ఏపీఈఎంజే జర్నలిస్టులు నాయకులు సమైక్యంగా కలిసి పనిచేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కమిటీలు లేని చోట్ల వెంటనే కమిటీలను నియమించి, సభ్యత్వ నమోదు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ సూచించారు.
Andhra Pradesh
Journalists Welfare
APEMJA
APUWJ
Electronic Media Journalists
ప్రెస్ క్లబ్ విజయవాడ
మీడియా సంఘాలు
జర్నలిస్టుల సమస్యలు
Scroll for the next article