Crime8th Dec 02:39 PMSunil Byrisetty1 min read
కలవరం పుట్టిస్తున్న కాల్ మెర్జింగ్ స్కాం
ఇప్పుడు కాల్ మెర్జింగ్ స్కాం బారిన చాలామంది పడుతున్నారు. ఒక తెలియని వ్యక్తి మీకు కాల్ చేసి మీ ఫ్రెండ్ నుంచి నెంబర్ తీసుకున్నానని చెబుతాడు. అదే టైమ్‌లో మీ ఫ్రెండ్ కూడా వేరే నెంబర్ న
ఇప్పుడు కాల్ మెర్జింగ్ స్కాం బారిన చాలామంది పడుతున్నారు. ఒక తెలియని వ్యక్తి మీకు కాల్ చేసి మీ ఫ్రెండ్ నుంచి నెంబర్ తీసుకున్నానని చెబుతాడు. అదే టైమ్‌లో మీ ఫ్రెండ్ కూడా వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని చెప్పి ఇద్దరి కాల్స్‌ను మెర్జ్ చేయమని అడుగుతాడు. మీరు ఇది నిజమేనని కాల్ మెర్జ్ చేస్తే.. ఇక మీ పని ఖతమే. ఇలా చేయగానే సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ధ్రువీకరణకు అవసరమైన ఓటీపీ కాల్‌తో కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత బ్యాంక్ కాల్ నుంచి వచ్చే ఓటీపీని సేకరించి మీ అకౌంట్లోని డబ్బులు కాజేస్తారు. ఈ పద్దతిలో నిమిషాల్లోనే మీకు ఎలాంటి అనుమానం రాకుండా అకౌంట్లోని డబ్బులు స్వాహా చేస్తారు. ఇలాంటివారి బారిన పడకుండా ఉండాలంటే ఓటీపీ ఎవరితోనూ పంచుకోకూడదు. మీకు అనుమానం వస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. లేక బ్యాంక్ ప్రతినిధులను సంప్రదించాలి. దీని వల్ల మీ డబ్బులు వెంటనే తిరిగి పొందే అవకాశం ఉంటుంది.