News9th Jan 04:40 PMSunil Byrisetty1 min read

ఉద్యోగుల సమాఖ్య జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

మహారాష్ట్రలోని షిర్డీలో ఈ నెల 23 నుంచి 26వ తేదీ వర‌కు జ‌ర‌గ‌నున్న అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 18వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు, ఏపీ ఎన్జీ

ఉద్యోగుల సమాఖ్య జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
మహారాష్ట్రలోని షిర్డీలో ఈ నెల 23 నుంచి 26వ తేదీ వర‌కు జ‌ర‌గ‌నున్న అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 18వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు, ఏపీ ఎన్జీజీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ పిలుపునిచ్చారు. విజయవాడ ఎన్జీవో హోంలో జాతీయ ప్రతినిధులు, రాష్ట్ర ఎన్జీజీవో సంఘ నాయకుల‌తో క‌లిసి మ‌హాసభల పోస్ట‌ర్‌ను ఆవిష్కరించారు. విద్యాసాగర్ మాట్లాడుతూ 60 ఏళ్ల ఘ‌న చ‌రిత్ర క‌లిగిన సమాఖ్య దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల‌కు చెందిన దాదాపు 80 లక్షల మంది ప్ర‌భుత్వ ఉద్యోగులకు నేతృత్వం వ‌హిస్తోంద‌న్నారు. జాతీయ కౌన్సిల్ సమావేశాలకు అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 1,200 మంది ప్రతినిధులు హాజరవుతార‌ని, వివిధ దేశాల నుంచి కూడా ఆత్మీయ అతిథులుగా వివిధ స‌మాఖ్య‌ల‌కు సంబంధించిన ప్రతినిధులు కూడా హాజ‌ర‌వుతార‌ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 55 మంది ప్రతినిధులు హాజరవుతార‌ని తెలిపారు.
AP NGO Association
Employees Federation
National Conference
AIGSEF
Government Employees
Shirdi Conference
Employee Unions
Trade Unions
National Meet
Scroll for the next article