News26th Jan 03:36 PMSunil Byrisetty1 min read

లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకుందాం

దేశంలో రాజ్యాంగ హక్కులపై దాడులు జరుగుతున్నాయని, ఈ తరుణంలో భారత రాజ్యాంగ సంరక్షణ కోసం మనమంతా పునరంకితమవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పునరుద్ఘాటించారు. రాజ్యాంగంలో

లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకుందాం
దేశంలో రాజ్యాంగ హక్కులపై దాడులు జరుగుతున్నాయని, ఈ తరుణంలో భారత రాజ్యాంగ సంరక్షణ కోసం మనమంతా పునరంకితమవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పునరుద్ఘాటించారు. రాజ్యాంగంలోని సామ్యవాద, లౌకిక పదాలను కనుమరుగు చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ కుట్రపన్నుతోందన్నారు. మోడీ విధానాల్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. నేడు భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి పెనుముప్పు సంభవించిన నేపథ్యంలో పాలకవర్గాలు, రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పెద్దఎత్తున తిలోదకాలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడ, దాసరి భవన్ ఎదుట జాతీయ పతాకాన్ని పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలతో కలిసి ఈశ్వరయ్య ఎగురవేసి, రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ నేతలతో కలసి ఆయన ప్రతిజ్ఞ చేయించారు.
Indian Constitution
Secularism
Democracy
CPI
Gujjula Eshwarayya
Narendra Modi Government
NDA
Constitutional Rights
Republic Day
Political Statement
Indian Politics
Civil Liberties
Scroll for the next article