Crime6th May 12:27 PMSunil Byrisetty1 min read

గ్రూప్‌-1 అక్రమాల కేసులో క్యామ్‌సైన్‌ డైరెక్టర్‌ ధాత్రి మధు అరెస్టు

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 అక్రమాల కేసులో క్యామ్‌సైన్‌ డైరెక్టర్‌ ధాత్రి మధును పోలీసులు అరెస్టు చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డారని అతడ

గ్రూప్‌-1 అక్రమాల కేసులో క్యామ్‌సైన్‌ డైరెక్టర్‌ ధాత్రి మధు అరెస్టు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 అక్రమాల కేసులో క్యామ్‌సైన్‌ డైరెక్టర్‌ ధాత్రి మధును పోలీసులు అరెస్టు చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డారని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లోని అతడి కార్యాలయంలో మధును ఏపీ పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో ‘క్యామ్‌సైన్‌ మీడియా’ సంస్థ ప్రతినిధి పేరు ఏ2గా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా.. కొటేషన్‌ విధానంలో మూల్యాంకన బాధ్యతలు పొందిన సదరు సంస్థ అవకతవకలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో సీనియర్‌ ఐపీఎస్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఏ1గా ఉన్నారు.
Andhra Pradesh
AP Police
APPSC Group1 Scam
CamSign Director Arrest
క్యామ్‌సైన్‌ డైరెక్టర్‌ ధాత్రి మధును పోలీసులు అరెస్టు
గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనం
Scroll for the next article