News4th May 03:29 PMSunil Byrisetty1 min read
మావోయిస్టులతో చర్చలా.. నో చాన్స్!
కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదన్నారు. తుపాకులతో అమాయకులను చంపినవారితో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. మావోయిస్టులను నిషేధించిందే కా
కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదన్నారు.
తుపాకులతో అమాయకులను చంపినవారితో చర్చలు ఉండవని స్పష్టం చేశారు.
మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ అన్నారు.
మావోయిస్టులు మందుపాతరలు పెట్టి.. అన్ని పార్టీల నేతలను చంపారని వ్యాఖ్యానించారు.
ఇన్‌ఫార్మర్ల పేరుతో గిరిజనులను కాల్చి చంపారన్నారు.
తుపాకీ వీడనంత వరకు చర్చల ఊసే ఉండదని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేనని, మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీ పడుతున్నారని విమర్శించారు.
మావోయిస్టులతో మాటల్లేవు.. మాట్లాడుకోవడాల్లేవని బండి సంజయ్ పేర్కొన్నారు.