Health14th Nov 04:45 PMSunil Byrisetty1 min read
త్వరలో 'క్యాన్సర్ అట్లాస్'
క్యాన్సర్ కేసుల నమోదుకనుగుణంగా 'క్యాన్సర్ అట్లాస్' త్వరలో తయారవుతుందని ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా. నోరి దత్తాత్రేయుడు వెల్లడించారు. క్షేత్రస్థ
క్యాన్సర్ కేసుల నమోదుకనుగుణంగా 'క్యాన్సర్ అట్లాస్' త్వరలో తయారవుతుందని ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా. నోరి దత్తాత్రేయుడు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో నమోదయ్యే కేసుల నమోదుకు తయారయ్యే ఈ 'అట్లాస్'కు అనుగుణంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు, ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు, వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు వీలవుతుందన్నారు. ఈ అట్లాస్ ను సాధ్యమైనంత త్వరగా సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లకు అందచేస్తానన్నారు.
మంగళగిరిలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం క్యాన్సర్ డిసీజ్ బర్డన్ 5వ అడ్వయిజరీ సమావేశం జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన డాక్టర్ దత్తాత్రేయుడు మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవే ట్ ఆసుపత్రుల్లోనే కాకుండా ఎన్సీడీ-4.0 ద్వారా వచ్చే సమాచారాన్ని సైతం క్రోడీకరించి 'అట్లాస్' తయారుచేస్తామన్నారు. ముఖ్యంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా చికిత్స పొందుతున్న వారి వివరాలవల్ల ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులపై చాలా వరకు ఓ స్పష్టత వస్తుందన్నారు.