News23rd Apr 03:22 PMSunil Byrisetty1 min read

ఉగ్రదాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా క్యాండిల్స్ ర్యాలీ

కశ్మీర్లో ఉగ్రదాడి అందరినీ దిగ్ర్భాంతికి గురిచేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ దుర్ఘటనలో అశువులు బాసిన కుటుంబాలకు సానుభూతి తెలియచేస్తూ ఈరోజు సాయ

ఉగ్రదాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా క్యాండిల్స్ ర్యాలీ
కశ్మీర్లో ఉగ్రదాడి అందరినీ దిగ్ర్భాంతికి గురిచేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ దుర్ఘటనలో అశువులు బాసిన కుటుంబాలకు సానుభూతి తెలియచేస్తూ ఈరోజు సాయంత్రం క్యాండిల్స్ ర్యాలీ చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. క్యాండిల్స్ ర్యాలీ రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నందున అన్ని సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. మృతులలో విశాఖకు చెందిన వారు ఉన్నందున బీజేపీ నాయకులు ఆ కుటుంబానికి అండగా ఉండాలని కోరారు. ఎయిర్ పోర్ట్ నుంచి చంద్రశేఖర్ భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు పార్టీ నేతలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, క్యాండిల్స్ ర్యాలీ చేయాలని పిలుపునిచ్చారు
Pahalgam terrorist attack
Candlelight rally
BJP
Visakhapatnam
Chandramouli
క్యాండిల్స్ ర్యాలీ చేయాలని బీజేపీ శ్రేణులకు
దగ్గుబాటి పురందేశ్వరి .
Scroll for the next article