News13th Oct 04:49 PMSunil Byrisetty1 min read

రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభం

రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీ+7 విధానంలో నిర్మించిన సీఆర్డీఏ భవనాన్ని సోమవారం ఉదయం 9.55 గంటలకు సీఎం చంద్రబాబు రాజధానికి భూములు ఇచ

రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభం
రాజధాని అభివృద్ధి యాత్ర ఆరంభమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జీ+7 విధానంలో నిర్మించిన సీఆర్డీఏ భవనాన్ని సోమవారం ఉదయం 9.55 గంటలకు సీఎం చంద్రబాబు రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో కలిసి ప్రారంభించారు. సీఆర్డీయే, ఏడీసీఎల్‌తో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా ప్రభుత్వం భవన నిర్మాణాలు చేపట్టింది. ఈ కార్యాలయంలో ప్రారంభం అనంతరం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశాన్ని కూడా చెప్పకుండా విభజన చేశారు. రాష్ట్రం మధ్యలో రాజధాని పెడితే అందరికీ బాగుంటుందని అమరావతిలో ఏర్పాటు చేశాం. రాజధాని నిర్మాణానికి భూమి కావాలి... ప్రణాళికలకు అనుగుణంగా రాజధాని నిర్మించగలరా అని అనుమానపడ్డారు. సైబరాబాద్ నిర్మించిన అనుభవంతో అమరావతి నిర్మాణం ప్రారంభించాం. భూమి కోసం ఎదురుచూస్తున్న సమయంలో అమరావతి రైతులు నాకు దారి చూపారు. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ అనే కొత్త విధానాన్ని తెచ్చాం. సమీకరణ విధానాన్ని విజయవంతం చేసిన చరిత్ర అమరావతి రైతులదే. ప్రపంచంలో ఎక్కడా ల్యాండ్ పూలింగ్ విధానం లేదు.. మనమే ఈ విధానాన్ని తెచ్చాం.. సక్సెస్ చేశాం. అమరావతి పనుల రీ-స్టార్ట్ తర్వాత మొదటిగా సీఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభమైంది. సీఆర్డీఏ భవన ప్రారంభం రాజధాని అభివృద్ధి యాత్రకు ఆరంభం.”అని ముఖ్యమంత్రి వివరించారు.
Andhra Pradesh
Amaravati Farmers
Amaravati
Capital Development
CRDA
Chandrababu Naidu
Land Pooling
ADCL
అమరావతి పునర్జీవనం
సీఆర్డీఏ భవనం ప్రారంభం
సీఎం చంద్రబాబు
Scroll for the next article