News24th Apr 04:37 PMSunil Byrisetty1 min read
డా.ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీగా డా.పుల్లల చంద్రశేఖర్
ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. పుల్లల చంద్రశేఖర్ MD., DM.. ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ విజయవాడ వైస్ చాన్సలర్‌గా నియమితులయ్యారు. ఈయన పదవీకాలం 3 సం.లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్
ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. పుల్లల చంద్రశేఖర్ MD., DM.. ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ విజయవాడ వైస్ చాన్సలర్‌గా నియమితులయ్యారు.
ఈయన పదవీకాలం 3 సం.లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యునిగా 35 ఏళ్ల సర్వీస్‌లో ఎంతో మందికి కార్డియాక్ పేషెంట్లకు ప్రాణం పోశారు.
2003లో డాక్టర్ పి. చంద్రశేఖర్ కర్నూలు మెడికల్ కాలేజీ కార్డియాలజీ విభాగం HODగా బాధ్యతలు స్వీకరించడంతో ఈ విభాగం స్వర్ణయుగం ప్రారంభమైంది.
2003లో డాక్టర్ పి. చంద్రశేఖర్ ప్రారంభించిన కర్నూలు హార్ట్ ఫౌండేషన్, ప్రజల ప్రయోజనం కోసం ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలు & ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోంది. 2008లో HOD చేసిన అనేక ప్రయత్నాలు తర్వాత ఇన్వేసివ్ కార్డియాక్ క్యాత్‌లాబ్ ప్రారంభంతో పేద ప్రజలకు సేవలను విస్తరించడానికి మార్గం సుగమం చేసింది.
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిలో ఈయన ప్రస్థానం చిరస్మరణీయం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ కూడా అందుకున్నారు.