Politics14th Mar 06:56 PMSunil Byrisetty1 min read
ఎమ్మెల్యే, ఇంచార్జి కార్యాలయాలకి కార్డులు
తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ విశ్వవిద్యాలయం వంటిదని, అనేకమంది నేతలను తయారుచేసిన పార్టీ అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. కార్యకర్తల కోసం శిక్షణ తరగతులు నిర్వహించడమే కాకుండా, ప్రత్యే
తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ విశ్వవిద్యాలయం వంటిదని, అనేకమంది నేతలను తయారుచేసిన పార్టీ అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు.
కార్యకర్తల కోసం శిక్షణ తరగతులు నిర్వహించడమే కాకుండా, ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేసి డిగ్రీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
జాతీయ భావంతో ముందుకు వెళుతూ ప్రతిభకు పెద్దపీట వేసిన పార్టీ టీడీపీ అన్నారు.
జాతీయస్థాయిలో టీడీపీ పోషించిన కీలకపాత్రలు మరే పార్టీకి సాధ్యం కాలేదు అని వివరించారు.
పార్టీ కార్యక్రమాలకు టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నామని, ఎవరికి పదవి ఇచ్చినా అన్ని జాగ్రత్తలు తీసుకుని, అన్ని అంశాలు పరిశీలించాకే ఇస్తానని చంద్రబాబు వెల్లడించారు. ఎమ్మెల్యే, ఇంచార్జి కార్యాలయాలకు సభ్యత్వం కార్డులు అందజేస్తామని చెప్పారు.