Politics23rd Jun 11:54 AMSunil Byrisetty1 min read
సింగయ్య మృతి కేసులో ఏ2 గా జగన్!
పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న విషాదంలో కేసులు నమోదయ్యాయి. తాను వెళ్తున్న వాహనం కింద పడి చీలి సింగయ్య మృతికి కారణమైన వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్
పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న విషాదంలో కేసులు నమోదయ్యాయి. తాను వెళ్తున్న వాహనం కింద పడి చీలి సింగయ్య మృతికి కారణమైన వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను రెండో నిందితుడు(ఏ2)గా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై గత వారం గుంటూరులోని నల్లపాడు స్టేషన్‌లో మృతుడు సింగయ్య భార్య లూర్థు మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 106 (1) కింద కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఫుటేజీలలో సింగయ్య.. జగన్ వాహనం కిందే పడి మృతిచెందినట్లు వెల్లడవడంతో పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చారు. తెలిసీ మరణానికి కారణమయ్యారని బీఎన్‌ఎస్‌లోని 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని ఇదే కేసులో ఏ1గా చేర్చారు. ఏ3గా జగన్ వ్యక్తిగత కార్యదర్శి కె.నాగేశ్వరరెడ్డి, ఏ4గా వైవీ సుబ్బారెడ్డి, ఏ5గా పేర్ని నాని, ఏ6గా విడదల రజిని తదితరులను చేర్చారు.