Politics13th Mar 11:42 AMSunil Byrisetty1 min read

ఆ కేసుల నుంచి టీడీపీ నేతలకు విముక్తి

టీడీపీ నేతలు గతంలో చేసిన ఆందోళనలపై నమోదైన కేసులను విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఓబులాపురం మైనింగ్‌పై గతంలో టీడీపీ నేతలు ఆందోళనలు చేయగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ

ఆ కేసుల నుంచి టీడీపీ నేతలకు విముక్తి
టీడీపీ నేతలు గతంలో చేసిన ఆందోళనలపై నమోదైన కేసులను విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఓబులాపురం మైనింగ్‌పై గతంలో టీడీపీ నేతలు ఆందోళనలు చేయగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో వాయిదాలకు హాజరవుతున్నారు. ఈ కేసు విచారణకు సంబంధించి గురువారం కూడా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, చినరాజప్ప, ధూళిపాళ్ల నరేంద్ర, జనార్దన్‌రెడ్డి, తదితరులు విచారణకు హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా విచారణకు హాజరవుతున్న నాయకులకు కేసు కొట్టివేతతో విముక్తి లభించినట్లయింది.
TDP
Case
టీడీపీ
ఓబులాపురం
Scroll for the next article