Politics21st Nov 05:37 PMSunil Byrisetty1 min read
"జై శ్రీరామ్” నినాదాలపై కేసు.. 18 ఏళ్ల తర్వాత తీర్పు
2008 డిసెంబర్ 6 సంఘటన సందర్భంగా “భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్” అని నినాదాలు చేసినందుకే బీజేపీ నాయకులపై ఆనాడు పోలీసులు పెట్టిన కేసు సరిగ్గా 18 ఏళ్ల తర్వాత కొట్టివేశారు. రంగారెడ్డి జ
2008 డిసెంబర్ 6 సంఘటన సందర్భంగా “భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్” అని నినాదాలు చేసినందుకే బీజేపీ నాయకులపై ఆనాడు పోలీసులు పెట్టిన కేసు సరిగ్గా 18 ఏళ్ల తర్వాత కొట్టివేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కోర్టులో న్యాయ విచారణలో భాగంగా సంబంధిత న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుతో బిజెపి నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. షాద్ నగర్ కోర్టులో మొత్తం 16 మందిలో 14 మంది కోర్టుకు హాజరై, 18 ఏళ్లుగా తప్పుడు ఆరోపణలతో నడిపిన కేసుపై తమ నిర్దోషిత్వాన్ని ధైర్యంగా నిరూపించుకున్నారు. వారిలో స్థానిక బిజెపి నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, పి. కృష్ణారెడ్డి, నందిగాం వెంకటేష్, అశోక్ గౌడ్ తదితరులు ఉన్నారు.
ఈ న్యాయ ప్రయాణంలో పరమపదించిన అనాటి మహిళా నాయకురాలు వనంఝాన్సీ, ఖాజాన్న గౌడ్ ని నాయకులు స్మరించారు. కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియలను అడ్వకేట్ మహేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మురళి పర్యవేక్షించారు. జైశ్రీరామ్ నినాదంపై నమోదైన కేసుకు సంబంధించి కోర్టు కేసును అధికారికంగా కొట్టివేయడంతో, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి స్పందిస్తూ “దేశభక్తిపై పెట్టిన తప్పుడు కేసులు ప్రజల మనసుల్లోని జాతీయ భావాన్ని ఎప్పటికీ అణగదొక్కలేవనీ పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారవచ్చు కానీ భారత్ మాత పట్ల ఉన్న మా నిబద్ధతను ఎవరూ ఆపలేరు” అని పేర్కొన్నారు.