Politics22nd Sep 11:29 AMSunil Byrisetty1 min read
అంబటి సహా 15 మంది వైసీపీ నేతలపై కేసు
మాజీ మంత్రి, వైసీపీ నేత ‘అంబటి రాంబాబు’తో పాటు 15 మంది ‘వైసీపీ’ నేతలపై కేసు నమోదైంది. 'ఛలో విజయవాడ'కు అనుమతి లేదంటూ నిన్న కాజా టోల్ ప్లాజా వద్ద అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్న
మాజీ మంత్రి, వైసీపీ నేత ‘అంబటి రాంబాబు’తో పాటు 15 మంది ‘వైసీపీ’ నేతలపై కేసు నమోదైంది. 'ఛలో విజయవాడ'కు అనుమతి లేదంటూ నిన్న కాజా టోల్ ప్లాజా వద్ద అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యకు నిరసనగా కాజా టోల్ ప్లాజా వద్ద అంబటి రాంబాబు, వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో మంగళగిరి పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుతో పాటు మరో 15 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఆందోళనకు తరలి వచ్చారనే అంశంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసులకు భయపడేది లేదని రాంబాబు తేల్చి చెప్పారు.