Crime19th Mar 03:04 PMSunil Byrisetty1 min read

కొడాలి నాని బుక్కయినట్లే? విజిలెన్స్ కీలక నివేదిక

కృష్ణా జిల్లాలో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని బుక్కయినట్లే తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతల దందాలపై కన్నేసింది. విజిలెన్స్ విచారణకు ఆదే

కొడాలి నాని బుక్కయినట్లే? విజిలెన్స్ కీలక నివేదిక
కృష్ణా జిల్లాలో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని బుక్కయినట్లే తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతల దందాలపై కన్నేసింది. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విచారణలో గుడివాడలో దాదాపు రూ. 200 కోట్ల మట్టి దందా జరిగినట్లు కీలక ఆధారాలు సేకరించింది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో ఒక్క గుడివాడలోనే మట్టి మెరక కోసం తరలించే పేరుతో రూ. వంద కోట్లు దోచేశారని విజిలెన్స్ గుర్తించింది. భూసేకరణలో కూడా ధరలు పెంచేసి, వాటిలో వాటాలు పంచుకున్నారట. గుడివాడ మండలం మల్లాయపాలెంలో 16 మందిని గుర్తించారట. రాంగోపాల్ వర్మ సినిమా కోసం డబ్బులొచ్చినట్లు వారి ఖాతాల్లో వేసి, కొంత కమీషన్లు ఇచ్చి వెనక్కి తీసుకున్నట్లు తేలింది. 2021లో మొదట మందా ఛటర్జీ అనే వ్యక్తి ఖాతాలో రూ. కోటి 12 లక్షలు వేశారట. 2022 ఆగస్టు 5న కూడా మరోసారి 44 లక్షలు వేశారు. డ్వామా నుంచి అధికారికంగా కొందరి ఖాతాల్లో డబ్బు జమచేయించి, వైసీపీ నేతలు పంచుకుంటున్నారు. ఇలా కొందరు యువతను వాడుకుని, ప్రభుత్వ డబ్బులు వాడుకున్నారు. అయితే జగనన్న కాలనీల్లోనూ కొంత పని చేస్తారు. స్థానిక చెరువుల్లో మట్టి తెచ్చి, దూరం నుంచి తెచ్చినట్లు చూపేవారు. ఇంత డబ్బు ఖాతాల్లో పడేసరికి ఐటీ వారు విచారణకు నోటీసులిచ్చారు. వాళ్లు కంగారుపడి వైసీపీ నేతలను అడిగితే డెత్ సర్టిఫికెట్లు సృష్టించి ఐటీకి చనిపోయినట్లు చూపిద్దామని సలహా ఇచ్చారట. అప్పుడు సమాధానం, తిరిగి చెల్లించే పని ఉండదని చెప్పారట. మొత్తంగా రూ. 200 కోట్ల స్కాంలో మట్టి కోసమే రూ. వంద కోట్లు తినేశారని విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
Kodali Nani
Case
Vijayawada
కొడాలి నాని
Scroll for the next article