Politics19th Jul 04:20 PMSunil Byrisetty1 min read
వైసీపీకి మరో షాక్.. తమ్మినేని ఫ్యామిలీపై కేసు!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తప్పట్లేదు. శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీ సీనియర్లు కేసులతో చిక్కులు తెచ్చిపెడుతున్నారు. ఇటీవల మాజీమంత్రి అప్పలరాజు ఫ్యామిలీ కేసులతో ఉక్కి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తప్పట్లేదు. శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీ సీనియర్లు కేసులతో చిక్కులు తెచ్చిపెడుతున్నారు. ఇటీవల మాజీమంత్రి అప్పలరాజు ఫ్యామిలీ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. ఇప్పుడు మాజీ స్పీకర్ తమ్మినేని సహా కుటుంబ సభ్యులపై... భూ కబ్జా కుట్ర కేసు నమోదయింది. భూమి అసలు యజమాని బ్రతికి ఉండగానే, మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించి, దాని ఆధారంగా కాజేసే కుట్ర వెలుగులోకి వచ్చింది. తప్పుడు వారసత్వ పత్రాలు రూపొందించి.. సదరు భూమిపై హక్కులు పొందే ప్రయత్నం చేశారంటూ తమ్మినేని సీతారాం కుటుంబంపై అసలు యజమాని కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని తనయుడు చిరంజీవి నాగ్ ను A5 గా, తమ్మినేని సీతారాం ను A6 గా, భార్య తమ్మినేని వాణిని A7గా పోలీసులు చేర్చారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న 8మందిని అరెస్ట్ చేశామని, తమ్మినేని కుటుంబంపై దర్యాప్తు జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని జిల్లా ఎస్పీ తెలిపారు.