Telangana14th Jun 11:27 AMSunil Byrisetty1 min read

సీఎంపై వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై కేసు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర

సీఎంపై వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై కేసు
బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కేటీఆర్ మాట్లాడిన మాటలు అవమానకరంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Telangana News
politics
ktr
cm revanth reddy
Cyber Crime Police Registered Case on KTR
balmuri venkat
KTRపై కేసు నమోదు
Scroll for the next article