News5th Nov 02:12 PMSunil Byrisetty1 min read
ధాన్యం అమ్మిన 24 గంటల్లో నగదు జమ
ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఇబ్బందులు ఉండేవని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సమస్యలపై సమగ్రంగా చర్చించి కొనుగోళ్ల విషయంలో మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. పెద్ద స
ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఇబ్బందులు ఉండేవని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
సమస్యలపై సమగ్రంగా చర్చించి కొనుగోళ్ల విషయంలో మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. పెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతీ వారం టార్గెట్ పెట్టుకుంటున్నామని తెలిపారు. వర్షాలతో ధాన్యం కొనుగోళ్లు కాస్త ఆలస్యం అయ్యాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వైసీపీ హయాంలోని బకాయిలను కూటమి ప్రభుత్వం క్లియర్ చేసిందని గుర్తు చేశారు.
ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు పడుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.