Politics29th Oct 03:24 PMSunil Byrisetty1 min read
స్థానికంలో నగదు ప్రవాహం!?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నగదు ప్రవహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి పోలింగ్ ముగిసి, ఓట్ల ఫలితం వచ్చేవరకు అభ్యర్థుల నుంచి నోట్ల పంపిణీ జరగా
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నగదు ప్రవహిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి పోలింగ్ ముగిసి, ఓట్ల ఫలితం వచ్చేవరకు అభ్యర్థుల నుంచి నోట్ల పంపిణీ జరగాల్సిందేనని చెబుతున్నారు. పలు విధాలుగా పెట్టుబడులు సమకూర్చుకుని స్థానిక ఎన్నికలకు తెర తీయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎన్నికల నిబంధనలను పక్కన పెట్టి గెలుపే ధ్యేయంగా ఓట్లకు నోటు పంచకుండా ఎన్నికల పోలింగ్ జరగాల్సిందేనని చెబుతున్నారు. కనీసం రూ.500, పోటీ ఉంటే రూ.వెయ్యి పంచకుండా ఓటర్లను రప్పించలేమని అభ్యర్థులు భావిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు మొదలుకుని గ్రామస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల వరకు ఖర్చు తప్పదని చెబుతున్నారు. ప్రచారం ఖర్చు, పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, భారీగా వాహనాలు, అద్దె కార్యకర్తలు, జెండాలు, రోజువారీ ప్రచారాలు, బలహీన వర్గాల హామీలకు ఇలా ఖర్చు తడిసి మోపెడవుతోంది.