News4th May 10:43 AMSunil Byrisetty1 min read

సగం ధరకే పశువుల దాణా

రాష్ట్రంలోని పశుపోషకులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 50 శాతం రాయితీపైసమీకృత దాణా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కిలో రూ.22.11కు కొని రైతు సేవాకేంద్రాలు, పశు వైద్యశాలల ద్

సగం ధరకే పశువుల దాణా
రాష్ట్రంలోని పశుపోషకులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 50 శాతం రాయితీపైసమీకృత దాణా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కిలో రూ.22.11కు కొని రైతు సేవాకేంద్రాలు, పశు వైద్యశాలల ద్వారా రూ.11.10కే పంపిణీ చేయనుంది. 20 శాతం ప్రొటీన్ కలిగిన ఈ దాణాను తొలిసారి అందిస్తోంది. తెల్లరేషన్ కార్డు కలిగిన పశుపోషకులు ఈ లబ్ది పొందేందుకు అర్హులు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రెండు పెద్ద పశువులు, ఒక దూడకు 90 రోజులకుగానూ విడతల వారీగా 450 కిలోల దాణాను రాయితీపై పంపిణీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 లక్షల మంది పశుపోషకులకు లబ్ధి కలిగించేలా రూ.69 కోట్ల వ్యయంతో 31,067 టన్నుల దాణా పంపిణీకి పశు సంవర్ధక శాఖ చర్యలు చేపట్టింది. 50 కిలోల పరిమాణం కలిగిన దాణా సంచిని రూ.1,100కు కొని.. రూ.555కే పశుపోషకు లకు అందజేస్తారు. ఈ రాయితీ వల్ల ఆర్థికంగా అదనపు భారం పడుతున్నప్ప టికీ వేసవిలో పశుగ్రాసం కొరతను అధిగమించి, నిలకడగా పాడి ఉత్పత్తులు పొందేందుకు, పశువుల విక్రయాలను నిలువరించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
Andhra Pradesh
CM Chandra babu Naidu
Cattle feed at a 50 percent discount
50 శాతం రాయితీపైసమీకృత దాణా
20 శాతం ప్రొటీన్
తెల్లరేషన్ కార్డు కలిగిన పశుపోషకులు ఈ లబ్దికి అర్హులు
Scroll for the next article