Crime11th Jan 03:14 PMSunil Byrisetty1 min read

సైబర్ ఉచ్చులో సీబీఐ మాజీ జేడీ కుటుంబం!

సైబర్ దాడులకు నిరక్షరాస్యులే కాదు.. చదువుకున్న పెద్ద హోదాలోని వారూ మోసపోతున్నారు. తాజాగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ సైబర్

సైబర్ ఉచ్చులో సీబీఐ మాజీ జేడీ కుటుంబం!
సైబర్ దాడులకు నిరక్షరాస్యులే కాదు.. చదువుకున్న పెద్ద హోదాలోని వారూ మోసపోతున్నారు. తాజాగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ సైబర్ ఉచ్చులో పడ్డారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే 500% లాభాలు వస్తాయని నమ్మించిన కేటుగాళ్లు, ఆమెను కోట్ల రూపాయలకు మోసం చేశారు. ఆమె నుంచి 19 విడతలుగా మొత్తం రూ.2.58 కోట్లను పెట్టుబడి పెట్టించి దోచేశారు. అయితే పెట్టుబడిని విత్ డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Hyderabad Police
Digital Scam
Public Awareness
Cyber Crime
Online Fraud
Stock Market Scam
VV Lakshminarayana
Former CBI Joint Director
Cyber Trap
Investment Fraud
Scroll for the next article