Politics6th Jan 04:41 PMSunil Byrisetty1 min read
కరూర్ తొక్కిసలాట కేసు.. విజయ్‌కు సీబీఐ సమన్లు!
కరూర్ తొక్కిసలాట కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ, నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ
కరూర్ తొక్కిసలాట కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ, నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సమన్లు జారీ చేసింది. జనవరి 12న ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొంది. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి, సీబీఐ నటుడు విజయ్‌కు నోటీసులు జారీ చేసింది. సీబీఐ బృందం గత ఏడాది అక్టోబర్ 17నే కరూర్‌కు చేరుకుని, దర్యాప్తును ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే టీవీకే పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలను, ఆఫీస్ బేరర్లను సీబీఐ ప్రశ్నించింది. ఇప్పుడు, దర్యాప్తులో భాగంగా, పార్టీ అధినేత అయిన విజయ్‌ను కూడా విచారించాలని నిర్ణయించింది. ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించి, ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీని స్థాపించిన విజయ్‌కు, ఈ సమన్లు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.