Politics28th Nov 02:03 PMSunil Byrisetty1 min read

ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు: హైకోర్టుకు సీబీఐ

మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ షాకిచ్చింది. కేసులో భాగమైన పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న శ్రీ

ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు: హైకోర్టుకు సీబీఐ
మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సీబీఐ షాకిచ్చింది. కేసులో భాగమైన పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న శ్రీలక్ష్మిపై కేసును ఈ దశలో కొట్టివేయవద్దని సీబీఐ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆమె నేరం చేశారా లేదా అనేది సీబీఐ కోర్టులో జరిగే విచారణలోనే తేలుతుందని, అందువల్ల ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను అనుమతించరాదని స్పష్టం చేసింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐ వాదనలు వినిపిస్తూ శ్రీలక్ష్మిని ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఇప్పటికే అనుమతి మంజూరు చేసిందని గుర్తుచేశారు. అనుమతి ఇచ్చారా లేదా అన్నదే ముఖ్యం కానీ, ఎప్పుడు ఇచ్చారనేది కాదని పేర్కొన్నారు. ఈ కేసు నేరుగా లంచం తీసుకున్న వ్యవహారం కాదని, ఇది నేరపూరిత దుష్ప్రవర్తనకు సంబంధించినదని కోర్టుకు వివరించారు.
Andhra Pradesh
CBI
IAS Srilakshmi
Jagan Illegal Assets Case
Penna Cements Scam
High Court
Quash Petition
అవినీతి ఆరోపణలు
డీవోపీటీ అనుమతి
Scroll for the next article