Politics24th Sep 05:15 PMSunil Byrisetty1 min read

ఈసారి ఈసీపై.. కాక్రోచ్ గురి!

ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఎన్నికల సంఘంపై వచ్చిన కథనం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ స్పందించింది. 48 గంటల్లో ప్రధాన ఎన్ని

ఈసారి ఈసీపై.. కాక్రోచ్ గురి!
ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఎన్నికల సంఘంపై వచ్చిన కథనం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ స్పందించింది. 48 గంటల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే జంతర్ మంతర్ వద్ద మరోసారి నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించింది. దిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీజేపీ ప్రతినిధులు.. త్వరలో జరగబోయే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనూ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. “రెండు రోజుల్లోగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయకుంటే దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడతాం. అనంతరం ఢిల్లీలో జంతర్ మంతర్ 2.0 తప్పకుండా చేపట్టి తీరుతాం. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని భావిస్తే విపక్షాలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవద్దు. ప్రజాస్వామ్యానికి సీఈసీ ఓ ముప్పులా తయారయ్యారు. ఓటు హక్కు రద్దు చేసేందుకు ఆయన ఎవరు?" అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రశ్నించారు. సీఈసీ రాజీనామా చేయడంతోపాటు ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీజేపీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ అన్నారు.
Scroll for the next article